ఆన్లైన్ క్లాసులు పాక్షిక ప్రత్యామ్నాయం మాత్రమే

354చూసినవారు
ఆన్లైన్ క్లాసులు పాక్షిక ప్రత్యామ్నాయం మాత్రమే
కోవిడ్ ప్రభావంతో ఆన్లైన్ క్లాసులకు తెరలేచింది. డిజిటల్ డివైస్ సమస్యలు, కనీసం టీవీ లేకపోవడం, నెట్వర్క్ సమస్య, విద్యుత్ సరఫరా లోపం, వీటన్నిటికీ మించి ఆర్ధికపరమైన వెనుకబాటు ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి కారణం అవుతున్నాయి. ఉపాధ్యాయులు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి బోధించాల్సిన పరిస్థితి. వర్క్ సీట్లు రిపోర్టులు అదనపు హోం వర్క్ లో ఇటువంటివన్నీ ఉపాధ్యాయులు తమ క్రియేటివిటీ జోడించి చేస్తున్నారు. ఇవే కాక సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధిస్తున్నారు.

కానీ ఇవేవీ ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి. ప్రత్యక్ష బోధనలో విద్యార్థి పాఠంతో పాటు సామాజికరణ కూడా నేర్చుకుంటాడు. ఉపాధ్యాయుని సంరక్షణలో ఉంటాడు. తనకు తెలియకుండానే క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలు అలవడతాయి. తరగతి గదిలో సమవయస్కులతో నేర్చుకోవడం వలన వివిధ సామాజిక సామర్థ్యాలు బోధపడతాయి.

వీటన్నిటిని ఒక్కసారిగా కరోనా దెబ్బతీసింది. పిల్లల ఆరోగ్యం ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి విద్యను సైతం పక్కన పెట్టాల్సిన పరిస్థితి. కాకుంటే ఉపశమనం దిశగా, కాస్తోకూస్తో విద్యకు సంబంధం తెగిపోకుండా ఉండడానికి ఆన్లైన్ క్లాసులను ప్రసారం చేస్తున్నారు. వీటిలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంత పాల్గొన్నప్పటికీ వ్యవస్థీకృత లోపాల వల్ల ఇవి సక్సెస్ కాలేకపోతున్నాయి. కరోనా వల్ల సామాజిక వెనుకబాటుతనం, మౌలికవసతుల లోపం వంటివి బయటపడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిని గుర్తించి సామాజిక ఆస్తులు పెంచే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్