తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

1857చూసినవారు
తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని వివిధ తండాలలో ఆదివారం దాదాపు 95 శాతం గిరిజనులు తీజ్ పండుగ వేడుకలు చేస్తున్నారు. కరోనా రాష్ట్రంలో విపరీతంగా విస్తృతంగా పెరుగుతున్నది. కావున ఎంపీపీ పద్మావతి రవి నాయక్ ప్రజలకు భౌతిక దూరం పాటిస్తూ తీజ్ నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. గుంపులుగా ప్రజలు ఉండకండి, డ్యాన్స్ లు, డీజే బాక్సులు, బ్యాండ్ తదితర ఊరేగింపులు బంద్ చేసుకోండి. అందరూ సంతోషంగా ఉంటే వచ్చే సారి ఘనంగా పండుగ చేసుకోవచ్చు. మొదట మన ప్రాణం తర్వాతే ఆనందం. ఆనందం సంబరాల్లో జీవితాన్ని అంధకారం చేసుకోకండని ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్