హన్మకొండ: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉషా దయాకర్ రావు
దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా హన్మకొండ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉషా దయాకర్ రావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించమని అమ్మవారిని వేడుకున్నానన్నారు.