షాహిద్ భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలని సీపీఎం హన్మకొండ సౌత్ నాయకులు ఎన్నాం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ప్రగతినగర్, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా పల్లకొండ శ్రీకాంత్ అధ్యక్షతన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.