చేర్యాల రూరల్, చేర్యాల టౌన్, మద్దూరు, కొమురెల్లి, దుల్మిట మండలాలను కలుపుతూ చేర్యాల రెవిన్యూ డివిజన్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంగడి బజార్లో పోరు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు చేర్యాలను రెవిన్యూ డివిజన్ చేయాలని కోరారు.