మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టేషన్ ఘనపూర్ మండలంలో శ్రీ సాయిబాబు రాచర్ల అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల మొదలుకొని వచ్చే నెల 11వ తారీకు వరకు జరుగును కావున ప్రజలంతా బీజేపీలో చేరి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపు ఇచ్చారు. బీజేపీ సీనియర్లు కూడా సభ్యత్వం కోసం ప్రజల వద్దకు వెళ్లి సభ్యత్వ నమోదు చేయాలని కోరుకుంటున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్చార్జి, ఈ సందర్భంగా ప్రజలంతా బీజేపీలో చేరి మోడీకి మద్దతు పలుకుతూ భారతదేశం అభివృద్ధి కోసం పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇందులో ముఖ్యులు శ్రీ మీర్జా రహీం బేగ్ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు, శ్రీ గుర్రం వంశీకృష్ణ, శ్రీ గుర్రం వెంకన్న, శ్రీ ముదినేపల్లి వెంకన్న, శ్రీ రుద్రపు నరసింహులు, శ్రీ కుమార స్వామి, శ్రీ నాగరాజు, శరత్ కుమార్, శ్రీ కుమ్మం రాజు, సతీష్, ఆరోగ్యం మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు.