జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ సభా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్ఎస్ నాయకులను ఘాటుగా విమర్శించారు.
కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు వేల ఎకరాల భూములు కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించుకున్నారు. బిఆర్ఎస్ చేసిన విధ్వంసం, అవినీతి, అక్రమాలు వల్ల వీళ్ళ పాపాలు పండుతాయని తెలిసి ఆ పాపాలు నాకు అంటోందని నేను బయటకు వచ్చానని అన్నారు.