జనగామ పట్టణంలోని ధర్మకంచ ఏరియాలో సోమవారం ఇంటిముందు కూర్చున్న మానసిక దివ్యాంగురాలు శాడ సుజాత పై కుక్కలు విచక్షణ రాహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆమేను కుటుంబ సభ్యులు జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పాలక వర్గం కుక్కల బెడద నివారణ కు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.