శ్రీ సోమేశ్వరలక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి గత 15 ఏళ్లుగా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని ఈవో మోహన్ బాబు కోరారు. ఇప్పటి వరకు ఆలయానికి బకాయిలు చెల్లించని వారిపై చట్ట పరమైన చర్యలతో పాటు, వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. వెంటనే బకాయిలు చెల్లించి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని కోరారు.