పాలకుర్తి: మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితులు ఆర్థిక భరోసా

68చూసినవారు
పాలకుర్తి: మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితులు ఆర్థిక భరోసా
జనగాం జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గుడికుంట తండాకు చెందిన బానోత్ నరేష్ ఇటీవల మృతి చెందారు. శుక్రవారం చెన్నూర్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 2012-2013 సంవత్సరంలో కలిసి చదువుకున్న సహచర విద్యార్థులంతా కలిసి రూ. 25 వేలు నరేష్ కూతురు సారిక పేరిట స్థానిక తపాల శాఖలో స్థిర నిధి, ఖాతా పుస్తకాన్ని ప్రారంభించి, నరేష్ భార్య సంధ్యకి అందించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు సాజిద్, అశోక్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్