వర్షాల నేపద్యంలో జనగాం జిల్లా కలెక్టరేట్ లో 24 గంటలు పని చేసే విధంగా 9052308621 నెంబర్ తో కూడిన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా, చెరువు కట్టలు తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదలు వస్తే వాగులు వంకలు వైపు ప్రజలు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు.