వరంగల్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీకి చెందిన బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం భారీగా స్వాధీనం చేసుకున్నారు. నెక్కొండ మండల కేంద్రంలో అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేసినట్లు గా అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఓ ఇంట్లో నిల్వ చేసిన సుమారు రూ. 2, 76, 250 విలువ చేసే 110. 5 క్వింటాళ్ల పీడీయస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మహ్మద్ పాషా అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు.