మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఈసీ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. 2019లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు OCT 21న జరిగాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, నామినేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.