Mar 30, 2025, 18:03 IST/
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం మానేస్తున్నారా?
Mar 30, 2025, 18:03 IST
పని ఒత్తిడితో పాటు ఇతర కారణాలతో నేటి బిజీ లైఫ్లో చాలా మంది అల్పాహారాన్ని మానేస్తుంటారు. అయితే ఇది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం మానేస్తే, రక్తంలోని చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడి, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల డైలీ లైఫ్లో పనితీరు మందగించి, ఉత్సాహం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం గడిపితే జీవక్రియ తగ్గే ప్రమాదం ఉంటుంది.