రెండున్నర కిలోల గోధుమలు లేదా బియ్యం, ఖర్జూరాలు లేదా దాని విలువకు సరిపడా డబ్బును అందించాలని ప్రవక్త (స) చెప్పారు. ఇలా ఇంట్లో ఎందరుంటే అంత లెక్కగట్టి దానం చేయాలి. ఫిత్రా ఒకే కుటుంబానికైనా లేదా ఎందరికైనా దానం చేయొచ్చు. వితంతువులు, అభాగ్యులు, నిరుపేదలు ఫిత్రా దానానికి అర్హులు. తమ దగ్గరి బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటుంది ఖురాన్. ఫిత్రా సొమ్ము సంక్షేమ కార్యక్రమాల కోసం కాదని చెబుతారు ఉలమాలు.