జగన్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఇదే: పవన్

52చూసినవారు
జగన్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఇదే: పవన్
AP: గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే నాయకులు వాటాలు అడిగేవారని పవన్ ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్ని అభివృద్ధిలో ప్రజలకు ఏవిధమైన వాటా ఇస్తారని అడుగుతోందని.. ఇదే రెండు ప్రభుత్వాలకు మధ్య ఉన్న తేడా అని అన్నారు. గత ప్రభుత్వం ఏపీని అప్పుల్లో పడేసిందని, ఆ పరిస్థితినుంచి బయటపడేయడానికే పీ4 విధానం అమలు చేస్తున్నామని వివరించారు.

సంబంధిత పోస్ట్