ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. RR ఇచ్చిన 183 పరుగుల లక్ష్యఛేదనలో CSK నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకు పరిమితమైంది. CSK బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగులు చేశారు. RR బౌలర్లో హసరంగ 4 వికెట్లు తీయగా ఆర్చర్, సందీప్ తలో వికెట్ తీశారు.