ఏనుగుల గుంపు బీభత్సం.. ఏడుగురు మృతి

74చూసినవారు
ఏనుగుల గుంపు బీభత్సం.. ఏడుగురు మృతి
జార్ఖండ్‌ రాష్ట్రంలోని గుమ్లా, సిమ్దేగా జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. జనావాసా ప్రాంతాల్లో ఏనుగులు జరిపిన దాడుల వల్ల గత 4రోజుల్లోనే ఏడుగురు మృతి చెందారు. ఆదివారం ఇద్దరు మరణించగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. గుంపు నుంచి తప్పిపోయిన 4 ఏనుగులు నివాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని, ఇళ్లను సైతం ధ్వంసం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్