ఒరిస్సా నుంచి వరంగల్ కు అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని సోమవారం డోర్నకల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బి. రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ఒక బ్యాగుతో తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని వద్ద గంజాయి ఉన్నట్టు తెలిసిందన్నారు. అతని వద్ద నుండి 1,75 వేల రూపాయలు విలువచేసే ఏడు కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.