మహబూబాబాద్ (మ) కంబాలపల్లి గ్రామంలో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం దుర్గ భవాని మాలదారులు నిప్పుల పై నడిచారు. గ్రామంలో కొందరు యువతి, యువకులు 9 రోజులుగా భవాని మాల ధరించి దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇరుముడితో నృత్త్యం చేస్తూ ఊరేగింపుగా భవాని మాల దారులు మాల విరమణ కు తరలి వెళ్లారు.