గూడూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ

50చూసినవారు
మహబూబాబాద్ జిల్లా గూడూరు అయోధ్య పురం గ్రామాలలో ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన రిజిస్టర్ లను పరిశీలించారు. ధాన్యం యొక్క తేమ శాతం ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్