రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో క్షేత్ర స్థాయిలో పారదర్శకత పాటించి అర్హులైన పేదలకు లబ్ది చేకూర్చాలని CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కురవి గ్రామ కౌన్సిల్ సమావేశం CPI పార్టీ కార్యాలయంలో జరగగా ముఖ్య అతిధిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించి అధికారులే లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.