ట్రాన్స్కో లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పిన దళారుల మాయమాటలు నమ్మి మహబూబాబాద్ జిల్లాకు చెందిన బాధితులు మోసపోయారు. దళారులకు భారీ మొత్తం లో సమర్పించుకుని తిరిగి రాబట్టుకుండేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర లక్షల్లో వాసులు చేసినట్టు బాధితులు తెలియజేసారు. గతంలో ఫిర్యాదు ఇచ్చినా ఫలితం లేకపోవడం తో సోమవారం బాధితులు డీజీపీ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.