ములుగు జిల్లాలో ఒకేరోజు 50 కేసులు నమోదు

85చూసినవారు
ములుగు జిల్లాలో ఒకేరోజు 50 కేసులు నమోదు
ములుగు జిల్లా వ్యాప్తంగా ఆదివారం లారీల్లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దాడులు చేసి, నమోదు చేసిన కేసుల వివరాలను సోమవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ వెల్లడించారు. ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, పేరూరు మండలాల్లో మొత్తం ఒకే రోజులో 50 కేసులు నమోదైనట్లు తెలిపారు. 298 టన్నుల అదనపు ఇసుకను రికవరీ చేశామన్నారు. దాని విలువ రూ. 5. 1, 11, 870 ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :