ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో బుధవారం దారుణం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం వెంకటాపురం మండలం శాంతినగర్ కు చెందిన మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వచ్చి వేడి నీటిలో పడ్డాడు. ఇంటిదగ్గర వాటర్ హీటర్ పెట్టగా, ఆడుకుంటూ వచ్చి వేడి నీటిలో పడిపోయినట్లు తెలిపారు. కాగా తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు.