ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అఫ్టల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అఫ్టల్ మాట్లాడుతూ. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్లు, స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టామన్నారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు నిజాయతీ చాటుకోవాలన్నారు.