ఏటూరునాగారం: జోనల్ గేమ్స్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

80చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీం మినీ స్టేడియంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను ఏటూరునాగారం ఐటీడిఏ పీఓ చిత్రమిశ్రా జెండా ఎగురవేసి ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో గల గిరిజన సంక్షేమ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ క్రీడలు 2 రోజులపాటు జరగనున్నాయని తెలిపారు.