ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామంలో రూ. 40కోట్లతో నిర్మించిన ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయ భవన సముదాయాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశ మందిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గురుకుల భవనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.