అదనపు కలెక్టర్,డిపిఓను కలిసిన టిఎన్జీఓస్ నేతలు

72చూసినవారు
అదనపు కలెక్టర్,డిపిఓను కలిసిన టిఎన్జీఓస్ నేతలు
ములుగు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా అదనపు బాధ్యతలు స్వీకరించిన జిల్లా పరిషత్ సిఈఓ ఎం. సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజులను టిఎన్జీఓస్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షుడు పోలురాజు ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఈ సందర్భంగా వారిని సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ యూనియన్, జిల్లా కార్యదర్శి చైతన్య, వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్