ములుగు జిల్లాలో ఉన్న మల్లంపల్లిని నూతన మండలంగా ప్రకటిస్తూ గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మల్లంపల్లిని మండలంగా చేయాలంటూ గతంలో స్థానికులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మల్లంపల్లిని మండలంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మల్లంపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.