ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు లో 4. 19 కోట్లతో నిర్మాణం చేసిన హరిత హోటల్ నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. లక్ష్మి నృసింహ స్వామి దేవస్థాననికి నిత్యం వచ్చే వచ్చే పర్యాటకులకు వుండేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా ప్రారంభించకపోవడంతో డోరు అద్దాలు, బీటలు వారిన గోడలు, పగిలిన అద్దాలు బుతు బంగ్లా ను తలపిస్తుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి హోటల్ ను అందుబాటు లోకి తేవాలని
పర్యాటకులు కోరుతున్నారు.