ఏటూరునాగారంలో ఘనంగా మిలాద్- ఉన్-నబీ వేడుకలు

73చూసినవారు
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటూరునాగారంలో ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జమా మసీదు నుండి పలు వీధుల్లో జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మతగురువులు మాట్లాడుతూ. మహ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను, సోదర భావాన్ని బోధించారన్నారు. వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్