కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి చర్చలకు పిలిచింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు తన నివాసానికి రావాలని వైద్యులను ఆహ్వానించారు. “నిరసనలో పాల్గొన్న వైద్యుల ప్రతినిధులను ముఖ్యమంత్రితో చర్చలకు పిలవడం ఇది ఐదోసారి. అలాగే చివరిసారి కూడా" అని బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.