ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలోద్విచక్ర వాహనదారుడు వనం రాజు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు.