ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని సోమవారం అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉంది.