త్వరలోనే మరో 2 పథకాలు అమలు చేస్తామని శనివారం మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. రైతు భరోసా కూడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ములుగు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలపై రెండు బృందాల కళాకారులు గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ వివరాలను తెలియజేయడాన్ని మంత్రి అభినందించి మాట్లాడారు.