ములుగు జిల్లా నూగూరు, వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పెంకవాగును సిఐ బండారి కుమార్, స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పెంకవాగు ఉదృతంగా ప్రవహిస్తుందని, గ్రామస్తులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వాగుదాటే ప్రయత్నం చేయకూడదన్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.