భారీ వర్షాల నేపథ్యంలో ములుగు కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఆదివారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని అన్నారు.