అత్యవసరమైతనే ప్రజలు బయటకు వెళ్లాలి: పోలీసులు

59చూసినవారు
అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కన్నాయిగూడెం మండల పోలీసులు మైకు తో హెచ్చరించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల గ్రామంలో ఆదివారం ఏర్పాటుచేసిన గ్రామస్తుల సమావేశంలో పోలీసులు మైకు ద్వారా మాట్లాడుతూ. మరో 3రోజులు భారీవర్షాలు కురుస్తాయని, మండల ప్రజలు వాగులు, వంకలు, గోదావరిలో చేపలవేటకు వెళ్లొద్దని అన్నారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్