ములుగు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్లంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఓ ఆలయాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కన్నాయిగూడెం మండలంకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ బాధితులను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. కాగా ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రమేశ్, ఈఎంటీ నాగరాజు తెలిపారు.