ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్

81చూసినవారు
ములుగు జిల్లాలో ఒకవైపు పోలీస్ తనిఖీలు, మరోవైపు మావోయిస్టులు అలజడితో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్ ఘఢ్ సరిహద్దు మండలాలైన వాజేడు, వెంకటాపురంలో సోమవారం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల పలుచోట్ల మావోయిస్టులు అమర్చిన మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. అయితే అడవుల్లో మరికొన్ని మందుపాతరలు ఉన్నాయంటూ పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. ఈ క్రమంలో అడవుల్లోకి వెళ్లాలంటేనే స్థానిక ప్రజలు జంకుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్