ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం

63చూసినవారు
ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడ్డాయి. కాగా వర్షాల కారణంగా పొలాల వద్ద పనులకు వెళ్లిన కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్