వెంకటాపూర్: రామప్పను సందర్శించిన పర్యటకులు, విద్యార్థులు

77చూసినవారు
వెంకటాపూర్: రామప్పను సందర్శించిన పర్యటకులు, విద్యార్థులు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న యునెస్కో వారసత్వ సంపదగా నిలిచిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం పర్యాటకులు సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ ద్వారా ఆలయ చారిత్రక విశేషాలను, శిల్పకళా నైపుణ్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం రామప్ప చెరువులో బోట్ షికారు చేయడానికి ఆసక్తితో వెళ్లారు.

సంబంధిత పోస్ట్