వైద్యసేవలకు పడవలో వెళ్లాల్సిందే..!

81చూసినవారు
వైద్యసేవలకు పడవలో వెళ్లాల్సిందే..!
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు అవతల ఉన్న మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ వాసులు జ్వరాలతో అల్లాడుతున్నారు. కాగా జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు కొండాయి వైద్యాధికారి ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో మరపడవ ద్వారా జంపన్నవాగు దాటి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి తెలిపారు.