గంజాయి మత్తులో ఒకరిపై దాడి

75చూసినవారు
గంజాయి మత్తులో ఒకరిపై దాడి
గంజాయి మత్తులో ఒకరిపై దాడి చేసిన సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేటకు చెందిన అన్నం శ్రీకాంత్ తన మిత్రుడితో కలిసి వెళ్తున్నారు. శాంతినగర్లో ద్వారకపేటకు చెందిన మార్త సాయి గంజాయి మత్తులో వారిని మంచినీటి సీసా ఇవ్వమని అడిగాడు. శ్రీకాంత్ సీసా ఇవ్వకపోవడంతో కర్రతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్