వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లోని అమీనాబాద్ ప్రభుత్వ మోడల్ పాఠశాల లో బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల లో విద్యార్థుల సౌకర్యాలను పాఠశాల ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిసరాలను పరిశీలించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఫుడ్ పట్ల జాగ్రత్త వహించాలని పాఠశాల ప్రిన్సిపాల్ కి సూచించారు.