రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని ఉప్పరపల్లి చెన్నారావుపేట ప్రధాన రహదారిలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మండలంలోని కల్నాయక్ తండా గ్రామానికి చెందిన వసంత, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మడిశెట్టి నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా ప్రథమ చికిత్స చేసి, నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.