వర్షానికి కూలిన ఇళ్లు.. తప్పిన ప్రమాదం

54చూసినవారు
వర్షానికి కూలిన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో మంగళవారం మోడం శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెంకుటిల్లు గోడలు నానిపోయి కూలాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్