వైద్యం పేరుతో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కొన్ని ప్రవేట్ హాస్పటల్లో చేస్తున్న దోపిడిని అరికట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ సమావేశం బుధవారం గడ్డమీది బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన పెషేంట్ల ని నిలువు దోపిడీ చేస్తున్నారని, ఇష్టానుసారంగా టెస్ట్ పరీక్షలు, స్కానింగ్, అడ్మిట్ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.