నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు గందె శ్రీనివాస్ గుప్తా హాజరై మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజ హితం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిన మహోన్నతుడని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, బిఆర్ఎస్ నాయకులు గోనె నరహరి, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు పులి రమేష్ గౌడ్, శ్యామల దేవేందర్, సుదర్శన్, లింగయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.